Песня Evaremi Antunna (feat. Kutle Khan, Palakattu Sriram, Sooraj Santhosh & Mukesh) в исполнении Hiphop Tamizha - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:54 MP3, 7MB, 192kb/s
Текст песни Hiphop Tamizha - Evaremi Antunna (feat. Kutle Khan, Palakattu Sriram, Sooraj Santhosh & Mukesh)
నేల మీద దేవతలై
చిరునవ్వులతో మము దీవించండి
నింగిలోనా కోటి తారకలై
కొత్త కాంతులతో మాలో జీవించండి
మకరందంలో లేని ఆ మాధుర్యం అంత
మన బంధంలో కన్నా నే ధన్యుడ్ననుకున్నా
గుండెల్లో చమ్మే కళ్ళల్లో చిమ్మే
పండంటి జన్మే రాశాడు బ్రహ్మే
ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంథమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు నే లేని ఆ రోజు అనురాగం అనురాగం తీయ్యనిది
మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే
నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేలే
మమకారమన్నది లేనింటికి మాలక్ష్మి ఏనాడు రానేరాదు
ఆప్యాయత అన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు
విడిపోయీ కూడే వేళ భారాలే తీరేను
దూరాన నావే నాడో తీరాన్ని చేరెను
ఇంకొక జన్మంటు ఆ దేవుడు నాకిస్తే
మళ్ళీ ఈ బంథం నాకిమ్మని వరమడిగేస్తా
ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంథమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు నే లేని ఆ రోజు అనురాగం అనురాగం తీయ్యనిది
సంతోషం సంతాపం ఏమొచ్చినా గాని సంతోషం మాత్రం మేమ్ పంచుకుంటాం
దేవుళ్ళలా మీరు మా కళ్ళ ముందుంటె సేవకులై సేవ చెసుకుంటాం
చెట్టుని రాళ్ళెత్తి కొడితే తీయ్యని పళ్ళివ్వదా
పుడమిని గుండెల్లో కొలువ పుత్తడి శిరులివ్వదా
ఇంకో లోకంలో నేనుండే నాడైన
మళ్ళీ ఈ ఇంట్లో పుట్టే వరమడిగేస్తా
ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంథమేనాడు తీరనిది
నేనున్న ఈ రోజు నే లేని ఆ రోజు అనురాగం అనురాగం తీయ్యనిది
మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే
నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేలే