Текст песни Anantha Sriram - Idhi Idhi Maaya (From "Spark")
మలుపొద్దని పక్కకే వంచి
నీలి నింగిని నిలువునా చించి
మేఘమాలల మెరుపులు తెంచి
ధూళి గాలుల దురుసును పెంచి
దూసుకొచ్చాను నీ ముందుకే
చెయ్యి అందించు చాటేందుకే
ఇది ఇది మాయ మాయ
ఇది నిజమా
మెళకువ లాగే తోచే
కల మహిమా?
ఏమి తెచ్చావు చుక్కల తోటల నుంచి?
రెండు తోక చుక్కలు కోసుకొనొచ్చా
నీ చెవుల చివరిలో రవ్వలుగా గుచ్చా
ఏమి తెచ్చావు వేకువ అంచుల నుంచి?
ఎర్ర రంగు వెలుగులు తవ్వుకొనొచ్చా
నీ చెంప ఛాయతో చాల్లేదని విడిచా
కృష్ణబిలాన్ని వెంటేసుకొచ్చేది దేనికని
దిష్టి చుక్కకగా నీ బుగ్గ మీద దిద్దాలని
ఊహలో హాయి ఉన్న పళంగా
కళ్ళ ముందుంటే నమ్మేదెలా చెప్పుమా
విశ్వాసముంటే విశ్వాన్ని కూడా
శాసించగలదే నీలో ప్రేమ
ఇది ఇది మాయ మాయ
ఇది నిజమా
మెలకువ లాగే తోచే
కల మహిమా?