Текст песни Shreya Ghoshal - Sammohanuda (From "Rules Ranjann") సమ్మోహనుడా పెదవిస్తా నీకే
కొంచం కోరుక్కోవా
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా
పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె
చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
సమ్మోహనుడా పెదవిస్తా నీకే
కొంచం కోరుక్కోవా
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా
ఝుమ్మను తుమ్మెద నువ్వైతే
తేనెల సుమమే అవుతా
సందెపొద్దే నువ్వైతే
చల్లని గాలై వీస్తా
శీతాకాలం నువ్వే అయితే
చుట్టే ఉష్ణానౌతా
మంచు వర్షం నువ్వే అయితే
నీటి ముత్యానౌతా
నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
నదిలా కదిలిన ఎదలయలే
పొంగి ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా
నదిలా కదిలిన ఎదలయలే
పొంగి ప్రేమ అలలై
ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని
మీసంతో తడమాల
ఇపుడే తొడిమే తుంచి
సుఖమే పంచి ఒకటైపోవాలా
సమ్మోహనుడా పెదవిస్తా నీకే
కొంచం కోరుక్కోవా
ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే
నలుగే పెట్టుకోవా
పచ్చి ప్రాయాలే వెచ్చనైన
చిలిపి ఊసులాడ వచ్చే
చెమటల్లో తడిసిన దేహం
సుగంధాల గాలి పంచె
చూసెయ్ చూసెయ్ చూసెయ్
కలువై ఉన్నాలే శశివదన
తీసెయ్ తీసెయ్ తీసెయ్
తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా Закрыть текст