Текст песни Thaman S - Inkosaari Inkosaari
ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి
మళ్ళోసారి మళ్ళోసారి పిలవాలంది నువ్ ప్రతిసారి
మనసుకే మొదలిదే మొదటి మాటల్లో
వయసుకే వరదిదే వలపు వానల్లో
కుదురుగా నిలవదే చిలిపి ఊహల్లో
తగదని తెలిసినా చివరి హద్దుల్లో
నా రాదారిలో గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో పున్నాగలా పూచావేమో
ఎగరేసేయ్ ఊహాల్నే
చెరిపేసేయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే
చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసేయ్ ఊహాల్నే (ఎగరేసేయ్ ఊహాల్నే)
చెరిపేసేయ్ హద్దుల్నే (చెరిపేసేయ్ హద్దుల్నే)
దాటేద్దాం దిక్కుల్నే (దాటేద్దాం దిక్కుల్నే)
చూసేద్దాం చుక్కల్నే (చూసేద్దాం చుక్కల్నే)
కవ్విస్తావు నీవు నీ కంటి బాణాలతో గుండె అల్లాడేలా
నవ్విస్తావు నీవు నీ కొంటె కోణాలతో చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది
కంటి పాపలో నిన్నే దాచింది
నిన్న లేని ఇబ్బంది బాగుంది
నిన్ను కోరి రమ్మంటుంది