Текст песни S. P. Balasubramanyam - Ayyappa Sharanamayya
అయ్యప్పా శరణమయ్యా
ఈలకొట్టీ తోలవయ్యా
కొత్త రథం కదిలెనయ్యా
వెనకడుగే వెయ్యదయ్యా
అయ్యప్పా శరణమయ్యా
ఈలకొట్టీ తోలవయ్యా
కొత్త రథం కదిలెనయ్యా
వెనకడుగే వెయ్యదయ్యా
చీకటని చిక్కులని ఆగదురా భాయి
సుడిగాలులతో వానలతో చెయ్యిలడాయి
కొండలని కోనలని చూడకురా భాయి
అడుగెయ్యనిదే తీరమేది ఎదురురాదోయి
అయ్యప్పా శరణమయ్యా
ఈలకొట్టీ తోలవయ్యా
దీవెనలిచ్చే ఆ దేవుడికైనా కోవెలకట్టి దీపమెట్టాలి
అన్నముపెట్టే యజమానికి మనం దండలతోటి కంచెకట్టాలి
పనిని ఇచ్చీ మన బతుకులు నడిపించేవాడు
తన చక్రము నీ చేతికిచ్చీ తిప్పమన్నాడు
చీడలని చేరకుండ చెట్టుని కాపాడు
ఆ నీడనె నీకున్నదిరా చల్లని గూడు
అయ్యప్పా శరణమయ్యా
ఈలకొట్టీ తోలవయ్యా
అన్నవరం పిఠాపురం సామర్లకోట కడియం
యానం పాలెం రాజరాజరాజరాజరాజమండ్రీ
చినుకుపడందే నువు దున్నేచేలో తనకుతానే పైరు వస్తుందా
కనుకు విడందే కలలన్నీ నిజం చేసేటందుకు వీలు ఉంటుందా
చమటచిమ్మే శ్రమను నమ్మీ బతుకుబండిని తోయ్యి
అలుపు అనే మాట అనక అడుగులువేయ్యి
ముందుకెల్లే దారులన్నీ తెలుసుకోర భాయి
నీ వెనకే నలుగురినీ తీసుకెళ్ళాలి
అయ్యప్పా శరణమయ్యా
ఈలకొట్టీ తోలవయ్యా