Песня Nee Kallalo в исполнении Sagar - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:32 MP3, 6.5MB, 192kb/s
Текст песни Sagar - Nee Kallalo (From "Namo Venkatesa")
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మిదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలిపటం
ఓ పలుకనే లేని పెదవి మౌనాన్ని కదుపుతున్నాను నీకోసం
అదుపులో లేని ఆగనే లేని అడుగునయ్యాను ఈ నిమిషం
ఒకేలా నేడు నీలో నాలో కలలు గొడవ మొదలయ్యింది కొంచెం
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మిదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలిపటం
నువ్వేం చేశావు నా మనసుని నీకందించాను నీదేనని
నిన్నా మొన్నలకు వేచే కన్నులకు నేడే అందినది ఈ గెలుపు
నీకై చాచాను అరచేతిని నువ్వే నా గీతవయ్యావని
నాలో ఊహలకు నాలో ఆశలకు ప్రాణం పోసినది నీ పిలుపు
ఎటో చూస్తున్న నా చూపులకు నిదుర చెదిరి ఎదురయ్యింది మార్పు
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మిదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలిపటం
నమ్మానే చెలి నా ప్రేమని నీదాక వంతెనేస్తుందని
నువ్వే నేను అని ప్రేమే సైన్యమని జయించావులే నా లోకాన్ని
ఇలా చూశాక నా బొమ్మని స్వర్గంతోనైనా నాకేం పని
నన్నే కాదు అని నిన్నే చేరుకొని పంచిస్తానులే నా అందాన్ని
ఇలా నీతోనే నన్నే చూసి మురిసిపోవ ఏడు వింతలన్ని
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం భూమ్మిదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం నా మనసు గాలిపటం