Песня Naa Manasuney в исполнении S. P. Balasubramanyam - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:06 MP3, 5.9MB, 192kb/s
Текст песни S. P. Balasubramanyam - Naa Manasuney (From "Manmadhudu")
నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా
నా కెందుకిలా అవుతోంది చెప్పవా ఒక్కసారి
నీ వెంటపడే ఆశలకి చూపవా పులదారి
చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగ
తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా
నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికే తెలుపనీ మధురిమా
నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను
అలవాటుపడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా
నన్ను నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా
నీ కనులలో వెలగనీ ప్రియతమా
నీ పెదవికీ తెలుపనీ మధురిమా
సరదాల చిలిపి తనమా చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా
సాహిత్యం: సిరి వెన్నెల: మన్మధుడు: దేవి శ్రీ ప్రసాద్: యస్పిబాలు, చిత్ర