Текст песни Divya Kumar - Rayyi Rayyi Mantu (From "Vunnadhi Okate Zindagi")
గా రిగరి సానిసా
పనీ మపా ఆ
పా మపమ గాపమా
సగ సగ సనీ గాసనీపా
సాసనీ పనీ నీనిపా మపా
గమగమా మపమపా ఆ
రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంతగూటిలో
సా గస గరీ సనీప
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో
సా గస గమా పమాగ
నీలాకాశం ఎంత దూరమున్నా
ఎగిరామంటే అందదా
ఊహాలోకం ఎక్కడెక్కడున్నా
పిలిచామంటే నిజంగా నిజం కాదా
రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనసు సొంతగూటిలో
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో
సనిప రిసని మగరిస
సరిగమ పమగరి సని
సనిప రిసని మగరిస
సరిగమ పమదా
పదప మపమ గమగరి
రిమగరి నిరి సనిప
పదప మపమ గమగరి
రిగమ పదామప
ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చెయ్యందే
నిదుర పోనంటే గెలుపు ఖాయమే
స్వేచ్ఛ అంటే అర్థం ఏ గువ్వపిల్లో కాదూ
కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోడమే
రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంతగూటిలో
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో
దారి చూపించే వెలుగు వెంటుంటే
కారుచీకట్లో ఎన్నెన్ని కాంతులో
బొమ్మ గీయించే కుంచె తోడుంటే
రేయిలో సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటే అర్దం పరిచయాలు కాదు
తోడునీడవ్వాలి నడకలో పరుగులో
రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్తబాటలో
పనిపసా పనిపసా
పనిప సరిగ మగరిసా
పనిపరీ పనిపరీ
పనిప రిగమ పమగరి
సరిగమా సరిగమా
సరిగమ మపదని పామపా