Песня Bujji Thalli в исполнении Javed Ali - слушать онлайн в хорошем качестве или скачать трек в Mp3 бесплатно на ПК или телефон.
4:09 MP3, 6MB, 192kb/s
Текст песни Javed Ali - Bujji Thalli
గాలిలో ఊగిసలాడే దీపంలా
ఊగిసలాడే నీవు సందకాడా
నా ప్రాణం
నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా
చీకటి కమ్మెను నీ కబురందక
నా లోకం
సుడిగాలిలో పడి పడి లేచే
పడవల్లే తడబడుతున్నా
నీ కోసం
వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం
ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లీ
నీరు లేని చేపల్లే
తార లేని నింగల్లే
జీవమేది నాలోనా
నువ్వు మాటలాడందే మళ్లీ యాలకొస్తానే
కాళ్లాయేళ్లా పడతానే లెంపలేసుకుంటానే
ఇంక నిన్ను ఇడిపోనే
ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగ దాటే గట్టొన్నే
నీ కంటి నీటికి మాత్రం
కొట్టుకు పోతానే
నీ కోసం
వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం
ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లీ
ఇన్నినాళ్ల మన దూరం
తియ్యనైన ఓ విరహం
చేదులాగ మారిందే
అందిరాక నీ గారం
దేన్ని కానుకియ్యాలే
ఎంత బుజ్జగించాలే
బెట్టు నువ్వు దించేలా
లంచమేంటి కావాలే
గాలివాన జాడే లేదే
రవ్వంతైనా నా చుట్టూ
అయినా మునిగి పోతున్నానే
దారే చూపెట్టు
నీ కోసం
వేచుందే నా ప్రాణం
ఓ బుజ్జి తల్లి నా కోసం
ఓ మాటైనా మాటాడే
నా బుజ్జి తల్లీ